భారతదేశం, మే 22 -- విజయ్ బాబు ప్రధాన పాత్ర పోషించిన మలయాళ మిస్టరీ థ్రిల్లర్ చిత్రం 'పెండులమ్' 2023 జూన్ 16వ తేదీన థియేటర్లలో విడుదలైంది. ఈ మూవీకి రెజిన్ ఎస్ బాబు దర్శకత్వం వహించారు. థియేట్రికల్ రన్‍తో మంచి టాకే వచ్చింది. డిఫరెంట్ నరేషన్‍తో ఇంట్రెస్టింగ్‍గా ఈ మూవీ సాగుతుంది. ఇప్పుడు పెండులమ్ సినిమా తెలుగు డబ్బింగ్‍లో ఓటీటీలో అందుబాటులోకి వచ్చింది.

పెండులమ్ సినిమా తెలుగు వెర్షన్ ఈటీవీ విన్ ఓటీటీలో నేడు (మే 22) స్ట్రీమింగ్‍కు వచ్చేసింది. మలయాళంలో థియేటర్లలో విడుదలైన రెండేళ్ల తర్వాత తెలుగు డబ్బింగ్‍లో ఈ చిత్రం ఓటీటీలోకి వచ్చింది. ఈ మూవీని తెలుగులో ఈటీవీ విన్ ఓటీటీలో చూసేయవచ్చు.

పెండులమ్ చిత్రంలో విజయ్ బాబుతో పాటు రమేశ్ పిశ్రోడి, అనుమోల్, దేవకీ రాజేంద్రన్ , బినోజ్ విల్యా, ప్రకాశ్ బారే, ఇంద్రన్స్, షాజు శ్రీధర్ కీలకపాత్రలు పోషించారు. ఓ కల తర్వ...