భారతదేశం, జనవరి 30 -- తెలుగులో సింహరాశి, దేవిలాంటి సినిమాల్లో బాల నటుడిగా నటించిన గుర్తింపు పొందాడు మహేంద్రన్. అతడు లీడ్ రోల్లో నటించిన సినిమా నీలకంఠ. ఈ మూవీ ఈ నెల 2న థియేటర్లలో రిలీజ్ కాగా.. వచ్చే నెల మొదటి వారంలో డిజిటల్ ప్రీమియర్ కానుంది. ఆ వివరాలు ఇక్కడ చూడండి.

తమిళ రూరల్ డ్రామా అయిన నీలకంఠ జనవరి 2న థియేటర్లలో రిలీజ్ కాగా.. ఫిబ్రవరి 6 నుంచి సన్ నెక్ట్స్ ఓటీటీలో స్ట్రీమింగ్ కు రానుంది. ఈ సినిమా తమిళంతోపాటు తెలుగులోనూ అందుబాటులోకి వస్తున్నట్లు ఆ ఓటీటీ శుక్రవారం (జనవరి 30) వెల్లడించింది.

"పవర్, కష్టాలు, విజయాలను నీలకంఠలో చూడండి. ఫిబ్రవరి 6 నుంచి కేవలం సన్ నెక్ట్స్ లో చూడండి" అనే క్యాప్షన్ తో ట్వీట్ చేసింది. వాళ్లు శిక్షించిన మనిషి.. వాళ్ల లీడర్ గా ఎదిగాడు అనే కామెంట్ ఉన్న పోస్టర్ ను ఈ సందర్భంగా షేర్ చేసింది.

నీలకంఠ ఓ రూరల్ డ్రామా. ఓ స...