Hyderabad, జూన్ 19 -- మలయాళం క్రైమ్ థ్రిల్లర్ సినిమా రెండేళ్ల కిందట థియేటర్లలో రిలీజ్ కాగా.. ఇప్పుడు తెలుగులో ఓటీటీలోకి స్ట్రీమింగ్ కు వచ్చింది. ఈ మూవీ పేరు కొల్లా (Kolla). అంటే దోపిడీ అని అర్థం. ప్రముఖ మలయాళ నటి ప్రియా ప్రకాష్ వారియర్ లీడ్ రోల్స్ లో ఒకరిగా నటించిన ఈ సినిమా ఊహకందని ట్విస్టులతో సాగుతుంది.

కొల్లా ఓ మలయాళం క్రైమ్ థ్రిల్లర్ సినిమా. 2023లో థియేటర్లలో రిలీజైంది. ఇప్పటికే ప్రైమ్ వీడియోలో మలయాళం ఆడియోతో స్ట్రీమింగ్ అవుతోంది. అయితే గురువారం (జూన్ 19) నుంచి ఈటీవీ విన్ ఓటీటీలో తెలుగులో అందుబాటులోకి వచ్చింది. ఈ సినిమాలో రజిషా విజయన్, ప్రియా ప్రకాష్ వారియర్, వినయ్ ఫోర్ట్, అలెన్సియర్ లోపెజ్ లాంటి వాళ్లు నటించారు. బాబీ సంజయ్ స్టోరీ అందించగా.. సూరజ్ వర్మ డైరెక్ట్ చేశాడు.

ఈ సినిమా ఆనీ (రజిషా), శిల్ప (ప్రియా ప్రకాష్ వారియర్) అనే ఇద్దరు అ...