Hyderabad, మే 23 -- ఓటీటీలోకి ఇవాళ (మే 23) ఒక్కరోజే తెలుగు భాషలో నాలుగు సినిమాలు డిజిటల్ స్ట్రీమింగ్‌కు వచ్చేశాయి. హారర్, కామెడీ, యాక్షన్, మిస్టరీ థ్రిల్లర్ వంటి నాలుగు విభిన్న జోనర్స్‌లో ఉన్న ఆ సినిమాలు ఏంటీ, వాటి ఓటీటీ స్ట్రీమింగ్ ప్లాట్‌ఫామ్స్ ఏంటో ఇక్కడ తెలుసుకుందాం.

కోర్టు సక్సెస్ తర్వాత ప్రియదర్శి నచించిన సినిమా సారంగపాణి జాతకం. పాపులర్ డైరెక్టర్ మోహనకృష్ణ ఇంద్రగంటి దర్శకత్వం వహించిన ఈ సినిమాలో రూప కొడువాయూర్ హీరోయిన్‌గా చేయగా.. వివేక్ సాగర్ మ్యూజిక్ అందించారు. ఏప్రిల్ 25న థియేటర్లలో విడుదలైన సారంగపాణి జాతకం సినిమాకు మిక్స్‌డ్ రివ్యూస్ వచ్చాయి.

కానీ, కామెడీ ట్రాక్ బాగుందని ప్రశంసలు తెచ్చుకుంది సారంగపాణి జాతకం. తెలుగు కామెడీ థ్రిల్లర్ మూవీగా వచ్చిన సారంగపాణి జాతకం ఓటీటీ రిలీజ్ అయింది. నేటి నుంచి అమెజాన్ ప్రైమ్‌లో సారంగపాణి ఓటీటీ స్...