భారతదేశం, మే 4 -- 2025 చివరి నాటికి ఇన్వెస్టింగ్​ కంపెనీ బెర్క్​షైర్​ హాత్​వే సీఈఓ పదవి నుంచి రిటైర్​ అవ్వనున్నట్టు బిలియనీర్ ఇన్వెస్టర్ వారెన్ బఫెట్ తెలిపారు. గ్రేగ్ అబెల్​ని తన వారసుడిగా ప్రకటించారు. శనివారం జరిగిన కంపెనీ వార్షిక వాటాదారుల సమావేశంలో 93ఏళ్ల బఫెట్​ ఈ వ్యాఖ్యలు చేయడంతో బెర్క్​షైర్​ హాత్​వేలో ఒక శకం ముగిసిందని అందరు భావిస్తున్నారు.

ఈ ఏడాది చివరిలో గ్రేగ్ కంపెనీ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ అయ్యే సమయం ఆసన్నమైందని తాను భావిస్తున్నట్లు బఫెట్ తెలిపారు. కొన్నేళ్లుగా బఫెట్ వారసుడిగా ఉన్న గ్రేగ్​ అబెల్ ప్రస్తుతం బెర్క్​షైర్ హాత్​వేలో నాన్ ఇన్సూరెన్స్ బిజినెస్స్ వైస్ చైర్మన్​గా పిని చేస్తున్నారు.

"అబెల్ చాలా సంవత్సరాలుగా కంపెనీ నాన్-ఇన్సూరెన్స్ కార్యకలాపాలను నిర్వహిస్తున్నప్పటికీ, ఆయన కంపెనీ భీమా విభాగాలను పర్యవేక్షించడంలో లేదా దాని...