భారతదేశం, మే 12 -- మలయాళ హీరో బాసిల్ జోసెఫ్ హీరోగా నటించిన మరణమాస్ సినిమా ఏప్రిల్ 10వ తేదీన థియేటర్లలో విడుదలైంది. శివప్రసాద్ దర్శకత్వం వహించిన ఈ డార్క్ కామెడీ చిత్రం పాజిటివ్ టాక్ తెచ్చుకొని హిట్ కొట్టింది. దీంతో బాసిల్ జోరు కంటిన్యూ అయింది. ఈ మూవీ ఓటీటీలోకి ఇప్పుడు వస్తుందా అని చాలా మంది ఆత్రుతగా ఎదురుచూస్తున్నారు. ఈవారంలోనే మరణమాస్ చిత్రం ఓటీటీలోక్ రానుంది.

మరణమాస్ చిత్రాన్ని మే 15వ తేదీన స్ట్రీమింగ్‍కు తీసుకురానున్నట్టు సోనీ లివ్ ఇటీవల వెల్లడించింది. అయితే, మలయాళ చిత్రాలను చెప్పిన తేదీ కంటే ముందు రోజు సాయంత్రమే కొంతకాలంగా తీసుకొస్తోంది సోనీ లివ్. కొన్ని సినిమాల విషయంలో దీన్ని ఫాలో అయింది. మరణమాస్ విషయంలోనూ అదే చేయనుందట సోనీ లివ్. చెప్పిన దాని కంటే ఒక రోజు ముందు మార్చి 14న సాయంత్రమే మరణమాస్ సినిమాను ఆ ప్లాట్‍ఫామ్ స్ట్రీమింగ్‍కు తీసుకు...