Hyderabad, జూలై 11 -- ఓటీటీల్లో ఈ వీకెండ్ ఏం చూడాలా అని ఆలోచిస్తున్నారా? అయితే ఒకటి, రెండు కాదు.. ఒక్కో ఓటీటీలోకి ఈ వారం ఒక్కో హిట్ మూవీ అందుబాటులోకి వచ్చింది. మలయాళం బ్లాక్‌బస్టర్ యాక్షన్ థ్రిల్లర్ నరివెట్ట కూడా ఇందులో ఉంది. మరి ఏ ఓటీటీలో ఏ సినిమా చూడొచ్చో ఇక్కడ తెలుసుకోండి.

ఈ ఏడాది మలయాళం ఇండస్ట్రీ నుంచి వచ్చిన సూపర్ హిట్ మూవీ నరివెట్ట (narivetta) సోనీ లివ్ ఓటీటీలో గురువారం (జులై 10) నుంచి స్ట్రీమింగ్ అవుతోంది. ఓ నిజ జీవిత ఘటన ఆధారంగా తెరకెక్కిన ఈ యాక్షన్ థ్రిల్లర్ సినిమా బాక్సాఫీస్ దగ్గర పెద్ద విజయం సాధించింది. ఇప్పుడు సోనీ లివ్ ఓటీటీలో తెలుగులోనూ స్ట్రీమింగ్ అవుతోంది.

తెలుగు రొమాంటిక్ డ్రామా 8 వసంతాలు మూవీ శుక్రవారం (జులై 11) నెట్‌ఫ్లిక్స్ లోకి వచ్చింది. ఈ సినిమా థియేటర్లలో రిలీజైన మూడు వారాల్లోనే నాలుగు భాషల్లో స్ట్రీమింగ్ కు రావడం...