Hyderabad, మే 28 -- ఈవారం ఓటీటీ, థియేటర్లలోకి మలయాళం సినిమాలు క్యూ కడుతున్నాయి. వివిధ ఓటీటీ ప్లాట్‌ఫామ్స్ లోకి ఈ మూవీస్ వస్తున్నాయి. ఒకే రోజు మూడు మూవీస్ ఓటీటీలోకి, రెండు సినిమాలు థియేటర్లలోకి రాబోతున్నాయి. మరి ఆ సినిమాలేంటి? వాటిని ఎక్కడ చూడాలో తెలుసుకోండి.

బిగ్ బెన్ ఓ మలయాళం థ్రిల్లర్ మూవీ. గతేడాది థియేటర్లలో రిలీజైన ఈ సినిమా.. సుమారు ఏడాది తర్వాత ఓటీటీలోకి వస్తోంది. సన్ నెక్ట్స్ ఓటీటీలో శుక్రవారం (మే 30) నుంచి స్ట్రీమింగ్ కానుంది. ఇది యూకేలో ఉంటున్న జీన్ ఆంటోనీ, అతని భార్య లవ్లీ చుట్టూ తిరిగే స్టోరీ.

పోలీస్ ఆఫీసర్ అయిన జీన్.. ఓ రోజు లవ్లీతోపాటు పని చేసే వ్యక్తితో గొడవ పడటంతో అతన్ని పోలీసులు అరెస్ట్ చేస్తారు. ఆ తర్వాత వాళ్ల ఏడాదిన్నర కూతురిని అక్కడి వెల్ఫేర్ అధికారులు తమ కస్టడీలోకి తీసుకుంటారు. ఆ తర్వాత ఏం జరిగిందన్నదే ఈ మూవీ స్టోరీ. ...