Hyderabad, జూన్ 27 -- ఒకే ఓటీటీలోకి రెండు రోజుల వ్యవధిలో నాలుగు భాషలకు చెందిన నాలుగు సూపర్ హిట్ సినిమాలు స్ట్రీమింగ్ కు రావడం విశేషం. సన్ నెక్ట్స్ ఓటీటీ ఈవారం దూకుడు మీద ఉంది. తెలుగు, కన్నడ, తమిళం, మలయాళం భాషలకు చెందిన నాలుగు సినిమాలను తీసుకొచ్చింది. ఈ వీకెండ్ వీటిని చూడటానికి ప్లాన్ చేసేయండి.

సన్ నెక్ట్స్ ఓటీటీ ఈవారం గురు, శుక్రవారాల్లో నాలుగు సౌత్ భాషలకు చెందిన నాలుగు హిట్ సినిమాలను స్ట్రీమింగ్ కు తీసుకొచ్చింది. ఆ మూవీస్ ఏవో ఇక్కడ చూడండి.

తెలుగు మిస్టరీ థ్రిల్లర్ మూవీ ఒక పథకం ప్రకారం శుక్రవారం (జూన్ 27) స్ట్రీమింగ్ కు వచ్చింది. ఫిబ్రవరి 7న థియేటర్లలో రిలీజైన ఈ సినిమా సుమారు ఆరు నెలల తర్వాత ఓటీటీలోకి వచ్చింది. రెండు హత్యల్లో ఇరుక్కున్న సిద్ధార్థ్ (సాయిరాం శంకర్) అనే లాయర్ అలాంటి మరెన్నో హత్య గురించి తెలుసుకొని వాటిని ఎలా పరిష్కరిస్తాడన...