భారతదేశం, ఏప్రిల్ 27 -- రెండు తమిళ సినిమాలు తెలుగు డబ్బింగ్‍లో ఒకే వారం ఓటీటీలోకి వచ్చాయి. రెండూ హారర్ థ్రిల్లర్ జానర్‌లోనే ఉన్నాయి. హన్సిక లీడ్ రోల్ చేసిన గార్డియన్ సినిమా ఇందులో ఒకటి. తమిళంలో థియేటర్లలో విడుదలైన ఏడాది తర్వాత తెలుగు డబ్బింగ్‍లో ఈ చిత్రం ఓటీటీలోకి ఎంట్రీ ఇచ్చింది. మరో హారర్ థ్రిల్లర్ కూడా స్ట్రీమింగ్‍కు వచ్చింది. ఒకే ఓటీటీలోకి తాజాగా వచ్చిన రెండు హారర్ థ్రిల్లర్ సినిమాల వివరాలు ఇవే..

గార్డియన్ చిత్రం తెలుగు డబ్బింగ్‍లో ఈ వారం ఏప్రిల్ 24వ తేదీన ఆహా ఓటీటీ ప్లాట్‍ఫామ్‍లో స్ట్రీమింగ్‍కు వచ్చింది. హన్సిక లీడ్ రోల్ చేసిన ఈ చిత్రం తమిళంలో గతేడాది మార్చిలో విడుదలైంది. ఏడాది తర్వాత ఇప్పుడు తెలుగులో డబ్బింగ్ అయి ఆహా ఓటీటీలో ఈ చిత్రం స్ట్రీమింగ్‍కు ఎంట్రీ ఇచ్చింది. ఓ పాపను ప్రమాదాల నుంచి రక్షించేందుకు ఓ దెయ్యం చేసే ప్రయత్నాల చుట్టూ...