Hyderabad, జూన్ 8 -- మలయాళ థ్రిల్లర్ మూవీ 'కర్ణిక' థియేటర్లలో విడుదలైన పది నెలల తర్వాత, శనివారం (జూన్ 7) నుండి ఆన్‌లైన్‌లో స్ట్రీమింగ్ అవుతోంది. ఈ థ్రిల్లర్ సినిమా ఇప్పుడు మనోరమ మ్యాక్స్, సింప్లీ సౌత్ ఓటీటీ ప్లాట్‌ఫామ్‌లలో అందుబాటులో ఉంది.

ప్రియాంక నాయర్ ప్రధాన పాత్రలో నటించిన కర్ణిక మూవీ జూన్ 7 అర్ధరాత్రి 12 గంటల నుండి మనోరమ మ్యాక్స్, సింప్లీ సౌత్ ఓటీటీ ప్లాట్‌ఫామ్‌లలో విడుదలైంది. విదేశాల్లోని ప్రేక్షకులకు ఈ సినిమా సింప్లీ సౌత్ ద్వారా అందుబాటులో ఉంటుంది.

2024లో థియేటర్లలో విడుదలైనప్పుడు 'కర్ణిక' మూవీకి పెద్దగా రెస్పాన్స్ రాలేదు. అయితే, ఇప్పుడు ఓటీటీ విడుదల తర్వాత ఈ థ్రిల్లర్ సినిమాకు మంచి ఆదరణ లభిస్తుందని భావిస్తున్నారు. ఈ మధ్యే మలయాళ మూవీస్ 'బిగ్ బెన్', 'హంట్', 'ఊసెప్పెంటే ఒసియతు', 'అం అ:', 'మరణమాస్' వంటి మలయాళ మూవీస్ వివిధ ఓటీటీ ప్లా...