భారతదేశం, సెప్టెంబర్ 2 -- ఒకప్పుడు 'గార్డెన్ సిటీ'గా ప్రసిద్ధి చెందిన బెంగళూరు ఇప్పుడు కాలుష్యంతో ఉక్కిరిబిక్కిరి అవుతోంది! విషపూరితమైన గాలి.. మహా నగర నివాసితుల జీవిత కాలాన్ని తగ్గించేస్తోంది. యూనివర్సిటీ ఆఫ్ చికాగో ఎయిర్ క్వాలిటీ లైఫ్ ఇండెక్స్ (ఈక్యూఎల్​ఐ) కొత్త నివేదిక ప్రకారం.. బెంగళూరులో వాయు కాలుష్యం కారణంగా ప్రతి ఒక్కరి ఆయుర్దాయం రెండు సంవత్సరాల కంటే ఎక్కువగా తగ్గుతోంది. 1990ల చివరలో ఇది కేవలం ఎనిమిది నెలలు మాత్రమే ఉండగా, ఇప్పుడు భారీగా పెరిగింది.

గత 25 సంవత్సరాల్లో కర్ణాటకలోని అన్ని జిల్లాల్లో, ముఖ్యంగా బెంగళూరులో పీఎం 2.5 కణాల స్థాయిలు రెట్టింపయ్యాయి. ఉత్తర భారతదేశంలో కాలుష్యం ఎక్కువగా ఉన్నప్పటికీ, కర్ణాటకలో కాలుష్యం తక్కువగా ఉందని నివేదిక పేర్కొంది. అయినప్పటికీ, కాలుష్యం కారణంగా ఆరోగ్య సమస్యల భారం స్థిరంగా పెరుగుతోంది.

పీఎం 2.5...