భారతదేశం, డిసెంబర్ 7 -- పురాతన ప్రాశస్థ్యం ఉన్న ఒంటిమిట్ట శ్రీ కోదండరామ స్వామి ఆలయ అభివృద్ధికి టీటీడీ కీలక నిర్ణయం తీసుకుంది. వచ్చే 50 ఏళ్లకు సరిపడేలా పూర్తి స్థాయిలో అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టేలా మాస్టర్ ప్లాన్ ను రూపొందించనుంది. ఈ మేరకు టీటీడీ ఈవో అనిల్ కుమార్ సింఘాల్ అధికారులను ఆదేశించారు.

ఇదే అంశంపై టీటీడీ ఈవో సింఘాల్ అధికారులతో తాజాగా సమీక్షించారు. ఈ సందర్భంగా ఈవో మాట్లాడుతూ.. వచ్చే 50 సంవత్సరాలను దృష్టిలో ఉంచుకొని మాస్టర్ ప్లాన్ రూపొందించాలని సూచించారు. ఆరోజు నాటికి భక్తులు రోజుకు ఎంత మంది రావొచ్చు.? ఆలయ పరిసరాలు ఎలా ఉండాలి, భక్తులకు సరిపడేలా మౌళిక సదుపాయాలు, వసతి, రవాణా, చారిత్రక నేపథ్యం ఉట్టిపడేలా, ఆధ్యాత్మికత, మరింతగా భక్తులు వచ్చేలా ముందస్తు ప్రణాళికలతో మాస్టర్ ప్లాన్ ను రూపొందించాలని దిశానిర్దేశం చేశారు.

ఇందులో భాగంగా భక్త...