భారతదేశం, మే 24 -- యాపిల్​ లవర్స్​కి క్రేజీ న్యూస్​! లేటెస్ట్​ ఐఫోన్ 16 సిరీస్ సహా ఐప్యాడ్స్​, మ్యాక్​బుక్​, యాపిల్ వాచ్​లు, ఎయిర్​పాడ్స్​ వంటి పరికరాలపై విజయ్​ సేల్స్​ భారీ తగ్గింపును అందిస్తోంది. ఈ "యాపిల్​ డేస్​ సేల్​" మే 24 నుంచి జూన్ 1 వరకు దేశవ్యాప్తంగా అందుబాటులో ఉంటుంది. ఆన్​లైన్​తో పాటు విజయ్ సేల్స్ ఔట్​లెట్స్​లో ఈ డిస్కౌంట్స్​ని పొందొచ్చు. పూర్తి వివరాల్లోకి వెళితే..

సేల్​లో భాగంగా ఐఫోన్ 16 సిరీస్​పై గణనీయమైన ధర తగ్గింపులు లభిస్తున్నాయి. ఐసీఐసీఐ, యాక్సిస్ బ్యాంక్, కొటక్ మహీంద్రా కార్డులతో కొనుగోళ్లు చేసే వారికి రూ.4,000 వరకు ఇన్​స్టెంట్​ డిస్కౌంట్ లభిస్తుంది. డిస్కౌంట్ తర్వాత 128 జీబీ స్టోరేజ్ కలిగిన ఐఫోన్ 16 అసలు ధర రూ.79,900 నుంచి రూ.66,990కు తగ్గుతుంది. ఐఫోన్ 16 ప్లస్ 128 జీబీ వేరియంట్ ధర రూ.89,900 నుంచి రూ.74,990కు తగ్గింది...