భారతదేశం, జూలై 11 -- ఈ సంవత్సరం ఆదాయ పన్ను రిటర్న్ లను దాఖలు చేసే గడువును ముందే సెప్టెంబర్ 15, 2025 వరకు పొడిగించారు. ఇప్పుడు ఐటీఆర్ లను దాఖలు చేసే ముందు అందరూ తాము పాత పన్ను విధానంలో ఉన్నామా? లేక కొత్త పన్ను విధానంలో ఉన్నామా? అనే విషయాన్ని నిర్ధారించుకుని తదనుగుణంగా ఐటీఆర్ లను దాఖలు చేయాలి. పాత పన్ను విధానంలో ఐటీఆర్ లను దాఖలు చేసేవారికి పలు పన్ను మినహాయింపులు లభిస్తాయి.

పాత పన్ను విధానంలో ఐటీఆర్ లను దాఖలు చేసేవారికి స్మార్ట్ గా ఐటీఆర్ లను ఫైల్ చేయడానికి, ఎక్కువ ఆదా చేయడంలో సహాయపడటానికి 10 పన్ను మినహాయింపు విధానాలు ఇక్కడ ఉన్నాయి. అవి..

ఈ సెక్షన్ ద్వారా వార్షిక ప్రాతిపదికన రూ.1.5 లక్షల వరకు మినహాయింపు లభిస్తుంది. ఎంప్లాయీ ప్రావిడెంట్ ఫండ్ (EPF), పబ్లిక్ ప్రావిడెంట్ ఫండ్ (PPF), జీవిత బీమా ప్రీమియంలు, ఈక్విటీ లింక్డ్ సేవింగ్స్ స్కీమ్స్ (EL...