భారతదేశం, ఆగస్టు 31 -- సెప్టెంబర్ 2025 నుంచి దేశంలో పలు ఆర్థిక నిబంధనలు మారనున్నాయి. ఈ మార్పులు వ్యక్తిగతంగా, అలాగే వ్యాపార రంగంలో ఉన్నవారిపైనా ప్రభావం చూపనున్నాయి. ఆదాయ పన్ను రిటర్న్‌లు దాఖలు చేయడం, యూపీఎస్ (యూనిఫైడ్ పెన్షన్ స్కీమ్) ఎంపిక, సిల్వర్ హాల్‌మార్కింగ్ వంటి ముఖ్యమైన నిబంధనలు సెప్టెంబర్ నుంచి అమల్లోకి రానున్నాయి.

ఈ నేపథ్యంలో సెప్టెంబర్ నెలలో మారనున్న ముఖ్యమైన ఆర్థిక నియమాల వివరాలు ఇక్కడ తెలుసుకోండి..

సాధారణంగా ఆర్థిక సంవత్సరం (ఫైనాన్షియల్ ఇయర్) కోసం ఆదాయ పన్ను రిటర్న్‌లు (ఐటీఆర్​) దాఖలు చేయడానికి చివరి తేదీ జులై 31. అయితే, సెంట్రల్ బోర్డ్ ఆఫ్ డైరెక్ట్ టాక్సెస్ (సీబీడీటీ) మే 27న ఒక ప్రకటనలో, 2024-25 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి ఐటీఆర్ దాఖలు గడువును జులై 31, 2025 నుంచి సెప్టెంబర్ 15, 2025కి పొడిగించింది.

ఐటీఆర్​ ఫైలింగ్​కి సంబ...