భారతదేశం, ఏప్రిల్ 26 -- ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, రౌడీ హీరో విజయ్ దేవరకొండ మధ్య మంచి రిలేషన్ ఉంటుంది. ఒకరిపై ఒకరి ఇష్టాన్ని కొన్ని సందర్భాల్లో వీరు బయటపెట్టారు. విజయ్ దేవరకొండకు చెందిన క్లాతింగ్ బ్రాండ్ 'రౌడీ' బాగా పాపులర్ అయింది. ఈ బ్రాండ్ స్టోర్‌ను రీసెంట్‍గా హైదరాబాద్‍లో ప్రారంభించారు విజయ్. ఈ తరుణంలో అల్లు అర్జున్‍కు ఓ సర్‌ప్రైజ్ గిఫ్ట్ పంపారు.

విజయ్ దేవరకొండ తనకు గిఫ్ట్ పంపారంటూ ఇన్‍స్టాగ్రామ్ స్టోరీని నేడు పోస్ట్ చేశారు అల్లు అర్జున్. బన్నీ అన్నా.. కొన్ని రౌడీ బ్రాండింగ్ క్లాత్‍లు, పిల్లలకు బర్గర్లు పంపుతున్నానని విజయ్ దేవరకొండ రాసిన నోట్‍ను కూడా పంచుకున్నారు.

నా స్వీట్ బ్రదర్ అంటూ ఈ ఇన్‍స్టా స్టోరీ పోస్ట్ చేశారు అల్లు అర్జున్. విజయ్ దేవరకొండకు ట్యాగ్ చేశారు. "మై స్వీట్ బ్రదర్.. ఎప్పుడో ఏదో ఒకటి పంపుతుంటావ్. సో స్వీట్" అని క్యాప...