భారతదేశం, జూలై 12 -- అగ్నివీర్ వాయు పోస్టుల భర్తీకి రిజిస్ట్రేషన్​ ప్రక్రియను తాజాగా ప్రారంభించింది భారత వైమానిక దళం (ఐఏఎఫ్​). అర్హులైన అభ్యర్థులు ఐఏఎఫ్​ అగ్నిపథ్‌వాయు అధికారిక వెబ్‌సైట్ agnipathvayu.cdac.in ద్వారా ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవచ్చు. దరఖాస్తు చేసుకోవడానికి చివరి తేదీ జులై 31, 2025 అని గుర్తుపెట్టుకోవాలి. ఎంపిక పరీక్షలు సెప్టెంబర్ 25, 2025 నుంచి జరుగుతాయి. అర్హత, ఎంపిక ప్రక్రియ సహా ఇతర వివరాలను ఇక్కడ తెలుసుకోండి..

సైన్స్ సబ్జెక్టులు:

కేంద్ర, రాష్ట్ర, కేంద్రపాలిత ప్రాంతాల విద్యా బోర్డులచే గుర్తింపు పొందిన ఇంటర్మీడియట్/10+2/తత్సమాన పరీక్షలో గణితం, ఫిజిక్స్- ఇంగ్లీష్ సబ్జెక్టులతో మొత్తం మీద కనీసం 50% మార్కులు, ఇంగ్లీష్‌లో 50% మార్కులతో ఉత్తీర్ణులై ఉండాలి.

లేదా

కేంద్ర, రాష్ట్ర, కేంద్రపాలిత ప్రాంతాలచే గుర్తింపు పొందిన పాలిటెక...