భారతదేశం, మే 26 -- ఖరీఫ్ పంటకు, వ్యవసాయ ఆర్థిక వ్యవస్థకు కీలకమైన నైరుతి రుతుపవనాలు సాధారణ తేదీకి (జూన్ 1) 8 రోజుల ముందే శనివారం కేరళ తీరాన్ని తాకాయి. అనంతరం ఆదివారం కర్ణాటక, గోవా, మహారాష్ట్ర, ఈశాన్య రాష్ట్రాలైన మిజోరం, మణిపూర్, నాగాలాండ్​లోకి ప్రవేశించాయని భారత వాతావరణ శాఖ (ఐఎండీ) తెలిపింది.

రుతుపవనాలు ఇంత త్వరగా కేరళను తాకడం 16ఏళ్లల్లో ఇదే తొలిసారి. చివరిగా, 2009 మే 23న రుతుపవనాలు రాష్ట్రంలోకి ప్రవేశించాయి. గతేడాది మే 30న రుతుపవనాలు కేరళను తాకాయి.

కేరళపై నైరుతి రుతుపవనాలు ముందుగానే ప్రవేశించడానికి అనుకూల వాతావరణ, సముద్ర పరిస్థితుల కలయిక కారణమని చెబుతున్నారు. కాగా నైరుతి రుతుపవనాలు వార్షిక వర్షపాతంలో దాదాపు 70% అందిస్తాయి. ఖరీఫ్ విత్తనంలో కీలక పాత్ర పోషిస్తాయి.

మహారాష్ట్ర, దక్షిణ భారతదేశం, ఈశాన్య రాష్ట్రాల్లోని మరికొన్ని ప్రాంతాలకు రుత...