భారతదేశం, జనవరి 9 -- శుక్రవారం స్టాక్ మార్కెట్ ట్రేడింగ్‌లో ఇండియన్ ఎనర్జీ ఎక్స్ఛేంజ్ (IEX) ఇన్వెస్టర్లకు గట్టి షాక్ తగిలింది. ఒక్కరోజే ఈ షేర్ ధర ఏకంగా 7 శాతం పతనమై రూ. 139.80 వద్ద ముగిసింది. ఒకానొక దశలో ఇంట్రాడే గరిష్టాల నుంచి ఈ షేర్ దాదాపు 11 శాతం వరకు క్షీణించడం మార్కెట్ వర్గాలను ఆశ్చర్యానికి గురిచేసింది. ఈ భారీ పతనానికి దారితీసిన ఆ రెండు కీలక పరిణామాలు ఏంటో ఇప్పుడు చూద్దాం.

నేషనల్ స్టాక్ ఎక్స్ఛేంజ్ (NSE), ఇండియా గ్యాస్ ఎక్స్ఛేంజ్ (IGX) కలిసి దేశంలోనే తొలి గ్యాస్ ఫ్యూచర్స్ కాంట్రాక్ట్‌లను ప్రారంభించేందుకు చర్చలు జరుపుతున్నాయని వార్తలు వచ్చాయి. దీనిపై వివరణ ఇవ్వాలని బాంబే స్టాక్ ఎక్స్ఛేంజ్ (BSE) కోరగా, ఐఈఎక్స్ యాజమాన్యం స్పందించింది.

"ఆ వార్తలకు మాకు ఎలాంటి సంబంధం లేదు. ఎన్ఎస్ఈ, ఐజీఎక్స్ మధ్య చర్చలు జరుగుతుండవచ్చు. ఐజీఎక్స్ అనేది మాకు...