భారతదేశం, ఫిబ్రవరి 22 -- విశాఖపట్నం జిల్లాలోని శ్రీ వరాహ లక్ష్మీ నరసింహ స్వామి ఆలయంలో ఏప్రిల్ 20న జరగనున్న వార్షిక చందనోత్సవం సజావుగా నిర్వహించేందుకు సింహాచలం దేవస్థానం సన్నాహాలు ప్రారంభించింది. సింహాచలం దేవస్థానం సమన్వయ కమిటీ సమావేశం నిర్వహించారు. గత సంవత్సరాలలోని లోపాలను సమీక్షించి, భక్తుల సౌకర్యాన్ని దృష్టిలో ఉంచుకుని సమగ్ర ప్రణాళికను అమలు చేస్తామని ఈవో జె.వెంకటరావు అన్నారు.

2026 ఏప్రిల్ 20 నుండి శ్రీ వరాహ లక్ష్మీ నరసింహ స్వామి ఆలయంలో జరిగే వార్షిక చందనోత్సవానికి హాజరయ్యే భక్తులను తెల్లవారుజామున 3 గంటల నుండి దర్శనానికి అనుమతిస్తామని కార్యనిర్వాహక అధికారి వెంకటరావు తెలిపారు. జిల్లా కలెక్టర్ అధ్యక్షతన జరిగే సమావేశంలో అంతరాలయం దర్శనానికి సంబంధించి తుది నిర్ణయం తీసుకుంటామని వెల్లడించారు. సంబంధిత అన్ని శాఖల అధికారులు పూర్తి సహకారం అందించాల...