భారతదేశం, జూలై 4 -- ముకేశ్ అంబానీ నేతృత్వంలోని రిలయన్స్ ఇండస్ట్రీస్ షేరు ధర ఇటీవల కాలంలో స్థిరంగా పెరుగుతోంది. ఏప్రిల్​లో నమోదైన కనిష్ట స్థాయి రూ. 1,114 నుంచి ఏకంగా 37.5% పుంజుకుని, గత సెషన్‌లో 9 నెలల గరిష్ట స్థాయి రూ. 1,531.90ని తాకింది. ఇది 2024 జూన్‌లో నమోదైన రికార్డు స్థాయి రూ. 1,608కి మరింత చేరువవుతోంది. ఇక మంగవారం ట్రేడింగ్​ సెషన్​లో మధ్యాహ్నం 12:45 నాటికి రూ. 1521 వద్ద ట్రేడ్​ అవుతోంది.

ఆయిల్-టు-రిటైల్ దిగ్గజమైన రిలయన్స్ స్టాక్ 2025 మొదటి అర్ధభాగాన్ని 23.5% లాభంతో ముగించింది. ఇది 2017 తర్వాత దాని ఉత్తమ అర్ధ-వార్షిక పనితీరు! ఈ ర్యాలీతో కంపెనీ మార్కెట్ క్యాపిటలైజేషన్ తిరిగి రూ. 20 లక్షల కోట్లకు పైకి చేరింది. ఇప్పుడు రూ. 21 లక్షల కోట్లకు చేరువవుతోంది. మరి ఇక్కడి నుంచి రియలన్స్​ స్టాక్​ పరిస్థితేంటి? షేర్​ ప్రైజ్​ టార్గెట్​ ఎంత? నిపుణ...