భారతదేశం, ఏప్రిల్ 28 -- ఆంధ్రప్రదేశ్‌ ఫిజికల్ ఎడ్యుకేషన్‌ కామన్‌ ఎంట్రన్స్ టెస్ట్ 2025 రిజిస్ట్రేషన్లు ప్రారంభం అయ్యాయి. అర్హులైన అభ్యర్థుల నుంచి రెండేళ్ల డిప్లొమా కోర్సుతో పాటు రెండేళ్ల బ్యాచిలర్ ఆఫ్ ఫిజికల్ ఎడ్యుకేషన్ కోర్సులో ప్రవేశాలకు ఆన్‌లైన్‌ లో దరఖాస్తులు స్వీకరిస్తున్నారు.

ఏపీ ఉన్నతవిద్యా మండలి పర్యవేక్షణలో గుంటూరులోని ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయం ఈ పరీక్ష నిర్వహించనుంది.

ఏపీ పీఈ సెట్‌ ద్వారా ఏపీలో యూనివర్శిటీ కాలేజీలు, అనుబంధ కాలేజీల్లో డిగ్రీ, డిప్లొమా కోర్సుల్లో ప్రవేశాలు కల్పిస్తారు.

బ్యాచిలర్ ఆఫ్ ఫిజికల్ ఎడ్యుకేషన్‌ కోర్సుల్లో ప్రవేశాలకు దరఖాస్తు చేసే అభ్యర్థులు కనీసం 19ఏళ్ల వయసుతో గుర్తింపు పొందిన విశ్వవిద్యాలయం నుంచి గ్రాడ్యుయేషన్ పూర్తి చేసి ఉండాలి.

డిప్లొమా ఇన్‌ ఫిజికల్ ఎడ్యుకేషన్ కోర్సులో ప్రవేశాలకు దరఖాస్తు చేసు...