భారతదేశం, ఏప్రిల్ 16 -- విజయసాయిరెడ్డి రాజీనామాతో ఖాళీ అయిన రాజ్యసభ ఎంపీ స్థానానికి ఉప ఎన్నిక నిర్వహణకు షెడ్యూల్ విడుదలైంది. కాకినాడ సీ పోర్ట్‌ వ్యవహారంలో ఈడీ కేసులు నమోదు చేసిన తర్వాత అనూహ్యంగా ఎంపీ పదవికి సాయిరెడ్డి రాజీనామా చేశారు.

విజయ సాయిరెడ్డి రాజీనామాతో ఖాళీ అయిన రాజ్యసభ స్థానాన్ని భర్తీ చేసేందుకు ఎన్నికల షెడ్యూల్ విడుదలైంది. ఏప్రిల్ 22న ఎన్నికల నోటిఫికేషన్‌ విడుదల కానుంది. మే 9న పోలింగ్ జరుగుతుంది.

ఏపీలో ఖాళీగా ఉన్న ఒక రాజ్యసభ ఎంపీ స్థానానికి ఉప ఎన్నికకు కేంద్ర ఎన్నికల సంఘం మంగళవారం షెడ్యూల్ విడుదల చేసింది. వైఎస్సార్సీపీ రాజ్యసభ సభ్యుడు విజయ సాయిరెడ్డి రాజీనామా చేయడంతో ఖాళీగా ఉన్న ఈ స్థానానికి ఉప ఎన్నిక నిర్వహించనున్నట్లు ఈసీ పేర్కొంది.

ఎన్నికల సంఘం షెడ్యూల్ ప్రకారం.. ఈ నెల 22న నోటిఫికేషన్ జారీ చేస్తారు. 29 వరకు నామినేషన్లు స్...