భారతదేశం, మే 16 -- ఆంధ్ర ప్రదేశ్‌ ప్రభుత్వ ఉద్యోగుల బదిలీలకు ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. మే 16 నుంచి జూన్ 2వ తేదీ వరకు ఉద్యోగుల బదిలీలపై ఉన్న నిషేధాన్ని సడలిస్తూ గురువారం ఉత్తర్వులు జారీ చేసింది.ప్రభుత్వ ఉద్యోగుల బదిలీలు, పోస్టింగ్‌లకు సంబంధించిన మార్గదర్శకాలను ఆర్థిక శాఖ ము‌ఖ్య కార్యదర్శి జారీ చేశారు.

ఏపీలో జూన్ 3వ తేదీ నుంచి ఉద్యోగుల బదిలీలపై మళ్లీ నిషేధం అమల్లోకి వస్తుందని ఆర్థిక శాఖ ముఖ్య కార్యదర్శి పీయూష్ కుమార్ ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. మే 16 నుంచి జూన్‌ 2లోగా బదిలీ ప్రక్రియ పూర్తి చేయాల్సి ఉంటుంది.

నోటిఫైడ్ ఏజెన్సీ ప్రాంతాల్లోని ఖాళీలను మార్గదర్శకాలు జారీచేసిన ప్రభుత్వం, ఏజెన్సీ ప్రాంతాల్లోని ఖాళీల భర్తీ చేయడానికి ప్రాధాన్యం ఇవ్వాలని మార్గ దర్శకాల్లో సూచించింది. ఐటీడీఏల్లో ఉద్యోగుల బదిలీలు పూర్తైన తర్వాత నాన్-ఐటీడీఏ పోస్ట...