భారతదేశం, ఏప్రిల్ 25 -- ఆంధ్రప్రదేశ్‌లో ఐపీఎస్‌ అధికారులకు ఇంటెలిజెన్స్ బాధ్యతలు పెద్దగా అచ్చి రావడం లేదు. గత పదేళ్లలో ప్రభుత్వాలకు కళ్లు, చెవులుగా పనిచేసిన ఇద్దరు డీజీ స్థాయి అధికారులు తర్వాతి కాలంలో చిక్కుల్లో పడ్డారు. 2014-19 మధ్య కాలంలో ఇంటెలిజెన్స్ బాధ్యతలు చూసిన ఏబీ వెంకటేశ్వరావు వైసీపీ ప్రభుత్వంలో వేధింపులకు గురైతే, 2019-24 మధ్య కాలంలో ఇంటెలిజెన్స్ చీఫ్‌గా పనిచేసిన పిఎస్సార్ ఆంజనేయులు ఏకంగా జైలుకు వెళ్లాల్సి వచ్చింది.

ఏపీలో రాజకీయాలకు ప్రభుత్వ అధికారులు మూల్యం చెల్లించుకోవాల్సి వస్తోంది. ప్రభుత్వాలను నడిపించే నేతల ఆదేశాలను తూచ తప్పకుండా పాటించడమే వారికి శాపంగా మారుతోందనే విమర్శలు ఉన్నాయి. గత పదేళ్లలో ఇద్దరు డీజీ స్థాయి అధికారులు ఎదుర్కొన్న పరిణామాలు చర్చనీయాంశంగా మారాయి.

ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో కీలకమైన నగరాల్లో విజయవాడ పోలీస్ కమిష...