Hyderabad, జూన్ 10 -- అల్లరి నరేష్, ఫారియా అబ్దుల్లా నటించిన కామెడీ మూవీ ఆ ఒక్కటి అడక్కు. బాక్సాఫీస్ దగ్గర బోల్తా పడిన ఈ సినిమా.. గతేడాది మే నెలలో రిలీజైంది. ఇప్పటికే అమెజాన్ ప్రైమ్ వీడియోలో స్ట్రీమింగ్ అవుతుండగా.. ఇప్పుడు ఈటీవీ విన్ ఓటీటీలోకి కూడా రాబోతోంది. ఈ విషయాన్ని ఆ ఓటీటీ మంగళవారం (జూన్ 10) వెల్లడించింది.

ఆ ఒక్కటి అడక్కు మూవీ గతేడాది మే 31 నుంచే ప్రైమ్ వీడియోలో స్ట్రీమింగ్ అవుతోంది. అయితే గురువారం (జూన్ 12) నుంచి ఈటీవీ విన్ ఓటీటీ కూడా ఈ సినిమాను స్ట్రీమింగ్ చేయనున్నట్లు తెలిపింది.

"కామెడీ, అయోమయం, పెళ్లి కోసం అన్వేషణ. అల్లరి నరేష్ ఫుల్ ఫన్ మోడ్ లో ఉన్న, నవ్వులు, ఎమోషన్స్ రోలర్ కోస్టర్ అయిన ఆ ఒక్కటి అడక్కు మూవీని చూడటానికి సిద్ధంగా ఉండండి. జూన్ 12న ఈటీవీ విన్ లో చూడండి" అనే క్యాప్షన్ తో ఆ ఓటీటీ ఓ ట్వీట్ చేసింది.

ఈ రొమాంటిక్ కామెడ...