భారతదేశం, జూన్ 23 -- రూ. 25వేల ధరలోపు కొత్త స్మార్ట్​ఫోన్​ కొనాలని ప్లాన్​ చేస్తున్నారా? అయితే ఇది మీకోసమే! వివో సంస్థ నుంచి మిడ్​ రేంజ్​ సెగ్మెంట్​లో కొత్త గ్యాడ్జెట్​ తాజాగా లాంచ్​ అయ్యింది. దాని పేరు వివో వై400 ప్రో. ఇదొక 5జీ స్మార్ట్​ఫోన్​. ఇందులో బడా బ్యాటరీతో పాటు అనేక ఫీచర్స్​ లభిస్తున్నాయి. వాటి వివరాలను ఇక్కడ తెలుసుకుందాము..

వివో Y400 ప్రో 5G 8GB ర్యామ్- 128GB స్టోరేజ్ మోడల్ ధర రూ. 24,999. అలాగే, 256GB స్టోరేజ్‌తో కూడిన హై-ఎండ్ వేరియంట్ రూ. 26,999కి లభిస్తుంది. ఈ పరికరాన్ని వివో ఇండియా వెబ్‌సైట్ ద్వారా ముందస్తు ఆర్డర్ చేసుకోవచ్చు. జూన్ 27 నుంచి వివో అధికారిక సైట్, ఫ్లిప్‌కార్ట్, అమెజాన్​తో పాటు ఎంపిక చేసిన రిటైల్ స్టోర్లలో ఈ ఫోన్ అమ్మకానికి అందుబాటులో ఉంటుంది. కస్టమర్‌లు ఫ్రీస్టైల్​ వైట్, ఫెస్ట్ గోల్డ్, నెబ్యులా పర్పుల్ అనే మూడు...