భారతదేశం, జూలై 14 -- స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్బీఐ) ప్రొబేషనరీ ఆఫీసర్ (పీఓ) పోస్టుల భర్తీకి దరఖాస్తు ప్రక్రియ నేడు, జులై 14, 2025తో ముగియనుంది. ఆసక్తి, అర్హులైన అభ్యర్థులు వెంటనే దరఖాస్తు చేసుకోవాలి. అభ్యర్థులు ఎస్​బీఐ అధికారిక వెబ్‌సైట్ sbi.co.in ద్వారా నేరుగా దరఖాస్తు చేసుకోవచ్చు.

దరఖాస్తు సమర్పించే ముందు, అభ్యర్థులు దరఖాస్తు ఫారమ్‌లోని ప్రతి విభాగంలో సరైన వివరాలను నింపారో లేదో తప్పనిసరిగా తనిఖీ చేసుకోవాలి. ఆన్‌లైన్ దరఖాస్తు/నమోదు విండో గడువు ముగిసిన తర్వాత ఎట్టి పరిస్థితుల్లోనూ ఎటువంటి మార్పులు, దిద్దుబాట్లు లేదా సవరణలు అనుమతించబడవు. పోస్ట్, ఈ-మెయిల్ లేదా నేరుగా సమర్పించిన అభ్యర్థనలు స్వీకరించరు. వాటిని తిరస్కరించడం జరుగుతుందని గుర్తుపెట్టుకోవాలి.

ఎస్​బీఐ పీఓ రిక్రూట్​మెంట్​ 2025 రిజిస్ట్రేషన్​కు అభ్యర్థులు ఏదైనా గుర్తింపు పొందిన...