భారతదేశం, జూన్ 23 -- వివిధ ఎస్‌ఎస్సీ పరీక్షలకు హాజరయ్యే అభ్యర్థులకు కీలక అలర్ట్​! కంబైన్డ్ గ్రాడ్యుయేట్ లెవెల్ (సీజీఎల్​), జనరల్ డ్యూటీ (జీడీ), కంబైన్డ్ హయ్యర్ సెకండరీ లెవెల్ (సీహెచ్​ఎస్​ఎల్​) 2026 పరీక్షలకు 'వన్ టైమ్ రిజిస్ట్రేషన్ (ఓటీఆర్​)'ను తప్పనిసరి చేసింది స్టాఫ్ సెలక్షన్ కమిషన్ (ఎస్‌ఎస్సీ). ఈ పరీక్షలకు దరఖాస్తు చేసుకోవాలనుకునే అభ్యర్థులు ssc.gov.in అనే అధికారిక వెబ్‌సైట్‌లో ఓటీఆర్​ ప్రక్రియను పూర్తి చేయాలి. పూర్తి వివరాలను ఇక్కడ తెలుసుకోండి..

ఎస్‌ఎస్సీ ఓటీఆర్ కోసం రిజిస్టర్ చేసుకునే ప్రక్రియ చాలా సులభం :

స్టెప్​ 1- ముందుగా, ssc.gov.in అనే అధికారిక వెబ్‌సైట్‌ను సందర్శించండి.

స్టెప్​ 2- "లాగిన్ లేదా రిజిస్టర్" అనే ఆప్షన్‌పై క్లిక్ చేయండి.

స్టెప్​ 3- తరువాత, "రిజిస్టర్" బటన్‌ను నొక్కండి.

స్టెప్​ 4- మీ పేరు, ఆధార్ కార్డ్ లేదా పాన్...