భారతదేశం, ఆగస్టు 4 -- ఇండియా ఆటోమొబైల్​ మార్కెట్​లో ఎలక్ట్రిక్​ వాహనాలకు సూపర్​ డిమాండ్​ కనిపిస్తోంది. కస్టమర్లు ఇప్పుడు ఈవీవైపు మొగ్గు చూపుతుండటంతో ఆటోమొబైల్​ సంస్థలు సైతం కొత్త కొత్త మోడల్స్​ని లాంచ్​ చేస్తున్నాయి. అయితే, ఈవీ కొనాలనుకునే వారు ఆలోచించే ప్రధాన అంశం 'రేంజ్​'! ఈ రేంజ్​ యాంగ్జైటీ చాలా మందిలో ఉంటుంది. ఈవీ ఛార్జింగ్ స్టేషన్ల ఏర్పాటుతో మౌలిక సదుపాయాలు చాలా వరకు మెరుగుపడినప్పటికీ, రోడ్లపై తిరుగుతున్న ఎలక్ట్రిక్​ కార్ల సంఖ్యతో పోలిస్తే అవి తక్కువే. అయితే, రేంజ్​ యాంగ్జైటీని తగ్గించేందుకు గూగుల్​ మ్యాప్స్​లో ఒక ఫీచర్​ ఉంది. ఆ ఫీచర్​ని వాడి, మీరు సాఫీగా ప్రయాణించవచ్చు.

అక్కి నాగ్‌పాల్ అనే యూట్యూబర్​.. తన అధికారిక యూట్యూబ్ ఛానెల్‌లో ఇటీవలే ఒక వీడియోని షేర్​ చేశారు. ఆ వీడియోలో, ఈవీ యజమానులు గూగుల్ మ్యాప్స్‌ను ఎలా కస్టమైజ్ చేసుకోవచ్చ...