భారతదేశం, ఫిబ్రవరి 12 -- దేశంలోనే అత్యున్నత వైద్య సేవలకు కేరాఫ్ అడ్రస్‌గా నిలిచే ఢిల్లీ ఎయిమ్స్‌లో సిబ్బంది కొరత తీవ్రంగా ఉంది. ఈ ప్రతిష్టాత్మక సంస్థలో మంజూరైన ఫ్యాకల్టీ పోస్టుల్లో 34 శాతానికి పైగా ఖాళీగా ఉన్నాయని కేంద్ర ప్రభుత్వం స్వయంగా అంగీకరించింది. రాజ్యసభలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ (YSRCP) ఎంపీ గొల్ల బాబూరావు అడిగిన ప్రశ్నలకు కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ లిఖితపూర్వక సమాధానం ఇచ్చింది.

ప్రభుత్వం వెల్లడించిన గణాంకాల ప్రకారం, ఢిల్లీ ఎయిమ్స్‌లో మొత్తం 1,306 ఫ్యాకల్టీ పోస్టులు మంజూరవ్వగా, ప్రస్తుతం అందులో 446 పోస్టులు ఖాళీగా ఉన్నాయి. అంటే సుమారు 34.15 శాతం మేర కీలకమైన డాక్టర్లు, ప్రొఫెసర్ల పోస్టులు భర్తీకి నోచుకోలేదు.

కేవలం ఫ్యాకల్టీ మాత్రమే కాదు, ఇతర విభాగాల్లోనూ ఇదే పరిస్థితి ఉంది. నర్సింగ్ ఆఫీసర్లు, టెక్నికల్ స్టాఫ్, అడ్మినిస్ట్రేటి...