భారతదేశం, జూన్ 21 -- ద్రవ్యోల్బణంతో పోరాడేందుకు సామాన్యుడికి ఉన్న ఆయుదం 'ఇన్వెస్ట్​మెంట్​'. ఇటీవలి కాలంలో ఇన్వెస్ట్​మెంట్​ విలువ తెలుసుకున్న భారతీయులు భారీ సంఖ్యలో స్టాక్​ మార్కెట్​లో పెట్టుబడులు పెడుతున్నారు. అయితే, స్టాక్​ మార్కెట్​లో రిస్క్​ ఎక్కువగా ఉంటుంది. ఆ రిస్క్​కి భయపడి అనేక మంది ఫిక్స్​డ్​ డిపాజిట్లలో పెట్టుబడులు పెడుతుంటారు. అయితే, ప్రస్తుతం ఆర్బీఐ రెపో రేట్లు తగ్గిస్తుండటంతో రానున్న రోజుల్లో ఎఫ్​డీలపై వడ్డీలు పడిపోతాయి. మరి అప్పుడు ఏం చేయాలి? రిస్క్​ లేకుండా మంచి రిటర్నులు పొందే ఆప్షన్స్​ ఏమున్నాయి? ఈ ప్రశ్నలకు సమాధానం.. 'ప్రభుత్వ పథకాలు'! 6 ప్రభుత్వ పథకాలు.. ఎఫ్​డీల కన్నా అధిక వడ్డీలను అందిస్తున్నాయి. వాటి వివరాలను ఇక్కడ తెలుసుకోండి..

ప్రిన్సిపల్ మొత్తాన్ని ముట్టుకోకుండానే స్థిరమైన నెలవారీ ఆదాయాన్ని కోరుకునే వారికి పీఓఎంఐఎస...