భారతదేశం, సెప్టెంబర్ 7 -- మీకు తక్షణమే డబ్బు అవసరమైనప్పుడు, దీర్ఘకాలిక పెట్టుబడులను బ్రేక్​ చేయకుండా లేదా అసురక్షిత రుణాల కోసం దరఖాస్తు చేయకుండా ఉండాలనుకుంటే, ఫిక్స్‌డ్ డిపాజిట్ (ఎఫ్​డీ) పై రుణం లేదా మ్యూచువల్ ఫండ్స్ పై పర్సనల్​ లోన్​ వంటివి ఆచరణాత్మక పరిష్కారాలు. ఈ రెండు మార్గాల్లోనూ మీ పెట్టుబడిని కొనసాగిస్తూనే రుణం పొందవచ్చు! అయితే, ప్రతి దానికీ దాని సొంత ప్రయోజనాలు, నష్టాలు, అర్హత అవసరాలు ఉన్నాయి.

ఎఫ్​డీలు, మ్యూచువల్ ఫండ్స్​పై రుణాల మధ్య పోలికను ఇక్కడ అందిస్తున్నాము. ఇది మీ ఆర్థిక పరిస్థితికి ఏది బాగా సరిపోతుందో అర్థం చేసుకోవడానికి సహాయపడుతుంది. ఏదైనా సాధనంపై రుణం తీసుకునే ముందు మీరు పరిగణించాల్సిన కీలక అంశాలను ఇక్కడ పరిశీలిము.

ఫిక్స్‌డ్ డిపాజిట్ పై పర్సనల్​ లోన్​ అనేది ఒక సురక్షితమైన రుణ ఎంపిక. ఇందులో మీ ఫిక్స్‌డ్ డిపాజిట్ తాకట్టుగ...