Hyderabad, జూన్ 26 -- జూనియర్ ఎన్టీఆర్ ప్రస్తుతం తన బాలీవుడ్ డెబ్యూ మూవీ వార్ 2 కోసం బిజీగా ఉన్నాడు. ఓవైపు ప్రశాంత్ నీల్ తో మూవీ చేస్తూనే.. ఆగస్ట్ 15న రిలీజ్ కానున్న వార్ 2 పనుల్లోనూ నిమగ్నమయ్యాడు. ఈ క్రమంలో అతడు గురువారం (జూన్ 26) ముంబైలో ల్యాండవడం, ఆ సమయంలో అతని చేతుల్లో ఒక బుక్ కనిపించడం విశేషం.

జూనియర్ ఎన్టీఆర్ దేవర మూవీ తర్వాత వరుస సినిమాలతో బిజీగా మారిపోయాడు. ఓవైపు వార్ 2, మరోవైపు ప్రశాంత్ నీల్ తో భారీ బడ్జెట్ మూవీ కొనసాగుతుండగానే.. త్రివిక్రమ్ శ్రీనివాస్ తో ఓ మైథలాజికల్ మూవీ చేయబోతున్నట్లు కూడా కన్ఫమ్ అయింది. ఈ విషయాన్ని ఇప్పటికే ప్రొడ్యూసర్ నాగవంశీ వెల్లడించాడు. ఇప్పుడా సినిమా కోసమే ఎన్టీఆర్ సిద్ధమవుతున్నట్లు అతని చేతుల్లో ఉన్న పుస్తకం చూస్తే తెలుస్తోంది.

అతడు పట్టుకున్న ఆ బుక్ పేరు మురుగ ది గాడ్ ఆఫ్ వార్ ది గాడ్ ఆఫ్ విజ్డమ్. ఆన...