Hyderabad, జూన్ 3 -- హాలీవుడ్ నుంచి ఇప్పుడో సినిమా రాబోతోంది. ఈ మూవీ బడ్జెట్ పక్కన పెడితే.. కేవలం ఇందులో నటించే యాక్టర్స్ రెమ్యునరేషన్లే ఏకంగా రూ.2100 కోట్లు అంటే నమ్మగలరా? ఇది ఇండియా కాదు కదా ఎన్నో హాలీవుడ్ టాప్ సినిమాల బడ్జెట్ కంటే ఎక్కువే. ఇక ఈ మూవీ మొత్తం బడ్జెట్, మార్కెటింగ్, ప్రమోషన్లను కలుపుకుంటే ఏకంగా 100 కోట్ల డాలర్లు (సుమారు రూ.8500 కోట్లు) కావడం విశేషం.

మార్వెల్ సినిమాటిక్ యూనివర్స్ (ఎంసీయూ) నుంచి రాబోతున్న మూవీ అవెంజర్స్: డూమ్స్‌డే. ప్రస్తుతం దీనినే ప్రపంచంలో అత్యంత ఖరీదైన మూవీగా చెబుతున్నారు. కేవలం మూవీ ప్రీప్రొడక్షన్ కోసం ఈ మధ్యే మేకర్స్ 80 లక్షల డాలర్లు అంటే సుమారు రూ.68 కోట్లు ఖర్చు చేశారు.

ఈ సినిమాను నిర్మించడానికి మార్వెల్ స్టూడియోస్ కు 50 నుంచి 60 కోట్ల డాలర్లు ఖర్చవుతుందని ఫోర్బ్స్ వెల్లడించింది. ఇప్పటి వరకూ ప్రపంచంల...