భారతదేశం, ఫిబ్రవరి 3 -- ఇండియన్ బాక్సాఫీస్ దగ్గర రూ. 1300 కోట్లకు పైగా వసూలు చేసి ఆల్ టైమ్ బ్లాక్‌బస్టర్‌గా నిలిచిన మూవీ 'ధురంధర్'. రణ్‌వీర్ సింగ్, అక్షయ్ ఖన్నా, ఆర్. మాధవన్ వంటి స్టార్లతో ఆదిత్య ధర్ తెరకెక్కించిన ఈ మూవీ జనవరి 30న నెట్‌ఫ్లిక్స్‌లోకి అడుగుపెట్టింది. విశేషమేమిటంటే ఈ సినిమాను పాకిస్థాన్ థియేటర్లలో విడుదల కాకుండా నిషేధించారు. కానీ ఓటీటీలో విడుదలైన వెంటనే పాకిస్థానీయులు ఈ సినిమాను ఎగబడి చూస్తున్నారు. అలాగే ఓ కరాచీకి చెందిన ఓ వ్యక్తి మూవీ రివ్యూని షేర్ చేశాడు.

ధురంధర్ సినిమా చూసిన తర్వాత కరాచీలో పుట్టి పెరిగిన ఓ పాకిస్థానీ రెడిట్ (Reddit) యూజర్ రాసిన నోట్ ఇప్పుడు ఇంటర్నెట్‌లో చర్చనీయాంశమైంది. సాధారణంగా ఇండియన్ స్పై సినిమాలపై పాకిస్థాన్‌లో వ్యతిరేకత ఉంటుంది. కానీ ఈ సినిమా తనను ఎంతగానో ఆకట్టుకుందని సదరు యూజర్ పేర్కొన్నాడు.

"నేన...