Hyderabad, అక్టోబర్ 9 -- ఈ శుక్రవారం (అక్టోబర్ 10) అంటే మరికొన్ని గంటల్లోనే ఓటీటీలోకి తేజ సజ్జ సూపర్ హీరోగా తిరిగి వస్తున్న 'మిరాయ్' స్ట్రీమింగ్ కానుంది. 'మిరాయ్' మాత్రమే కాకుండా తెలుగు సినిమా నుండి 'త్రిబాణధారి బార్బారిక్' కూడా రానుంది. మరోవైపు తమిళం నుంచి 'వేడువన్' వెబ్ సిరీస్, 'రాంబో' మూవీ వస్తున్నాయి. మలయాళం, కన్నడ నుండి కూడా 'వన్స్ అపాన్ ఏ టైమ్ దేర్ వాస్ ఏ కళ్ళన్' 'మాంక్ ది యంగ్' వస్తున్నాయి. మరి నాలుగు సౌత్ భాషల్లో వస్తున్న ఈ ఆరు సినిమాలు, వెబ్ సిరీస్ ఏవో చూడండి.

తేజ సజ్జ లీడ్ రోల్లో నటించిన మిరాయ్ మూవీ జియోహాట్‌స్టార్ లోకి వస్తోంది. 'హను-మాన్' తో ప్రేక్షకులను ఆకట్టుకున్న తేజ సజ్జ.. ఈ మిరాయ్ ద్వారా మరో ఫాంటసీ యాక్షన్-అడ్వెంచర్ తో తిరిగి వచ్చాడు. పురాతన శక్తివంతమైన గ్రంథాన్ని 'బ్లాక్ స్వోర్డ్' ఎలా దక్కించుకోవాలని చూస్తాడు.. ఒక అనాథ ...