Hyderabad, అక్టోబర్ 3 -- ఓటీటీలోకి ఈవారం కూడా వివిధ భాషల్లో సరికొత్త సినిమాలు, వెబ్ సిరీస్ అందుబాటులోకి వచ్చాయి. ప్రైమ్ వీడియోతోపాటు నెట్‌ఫ్లిక్స్, ఈటీవీ విన్, జీ5, సన్ నెక్ట్స్, సోనీ లివ్, ఆహా తమిళంలాంటి ఓటీటీ ప్లాట్‌ఫామ్స్ లో కొన్ని ఇంట్రెస్టింగ్ సినిమాలు, సిరీస్ ఉన్నాయి. వీటిని ఈ వీకెండ్ మిస్ కాకుండా చూడండి.

తెలుగు బ్లాక్‌బస్టర్ రొమాంటిక్ కామెడీ మూవీ లిటిల్ హార్ట్స్ బుధవారం (అక్టోబర్ 1) ఈటీవీ విన్ ఓటీటీలోకి వచ్చింది. బాక్సాఫీస్ దగ్గర ఏకంగా రూ.40 కోట్ల వరకూ వసూలు చేసిన ఈ సినిమాకు ఓటీటీలోనూ అదిరిపోయే రెస్పాన్స్ వస్తోంది. రెండు రోజుల్లోనే 5 కోట్ల స్ట్రీమింగ్ మినట్స్ రికార్డు నమోదు చేసింది.

అమెజాన్ ప్రైమ్ వీడియోలోకి శివకార్తికేయన్ మదరాసి మూవీ స్ట్రీమింగ్ కు వచ్చింది. ఇది కూడా బాక్సాఫీస్ దగ్గర సక్సెస్ అయిన సినిమానే. రూ.100 కోట్లకుపైగా వసూ...