Hyderabad, అక్టోబర్ 10 -- ఓటీటీల్లో ఈ వీకెండ్ ఏం చూడాలా అని ఆలోచిస్తున్నారా? అయితే ఇప్పుడు చెప్పబోయే లేటెస్ట్ మూవీస్, వెబ్ సిరీస్ ప్లాన్ చేయండి. ముఖ్యంగా ఆరు ఓటీటీ ప్లాట్‌ఫామ్స్ లోకి వచ్చిన ఈ 8 మూవీస్, వెబ్ సిరీస్ ఆసక్తి రేపుతున్నాయి. వీటిలో తెలుగుతోపాటు హిందీ, తమిళం, కన్నడ, మలయాళం భాషలకు చెందిన కంటెంట్ ఉంది.

శుక్రవారం (అక్టోబర్ 10) జియోహాట్‌స్టార్ లోకి వచ్చిన మూవీ ఇది. తేజ సజ్జ లీడ్ రోల్లో నటించిన సినిమా. 'హను-మాన్' తో ప్రేక్షకులను ఆకట్టుకున్న తేజ సజ్జ.. ఈ మిరాయ్ ద్వారా మరో ఫాంటసీ యాక్షన్-అడ్వెంచర్ తో తిరిగి వచ్చాడు. పురాతన శక్తివంతమైన గ్రంథాన్ని 'బ్లాక్ స్వోర్డ్' ఎలా దక్కించుకోవాలని చూస్తాడు.. ఒక అనాథ అయిన వేద ఆ ప్రయత్నాన్ని ఎలా అడ్డుకుంటాడు అనే కథాంశంతో కార్తీక్ ఘట్టమనేని ఈ సినిమాను తీశాడు. ఈ మూవీలో మంచు మనోజ్ విలన్‌గా నటించగా, శ్రియ ...