భారతదేశం, డిసెంబర్ 5 -- 2025 సంవత్సరం రష్మిక మందన్నాదే. ఈ ఏడాది ఆమె హీరోయిన్ గా నటించిన అయిదు సినిమాలు రిలీజ్ అయ్యాయి. ఛావా, సికందర్, కుబేర, థామా, ది గర్ల్ ఫ్రెండ్ సినిమాలతో అదరగొట్టింది రష్మిక. ఈ వారం నేషనల్ క్రష్ నటించిన రెండు సినిమాలు ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతున్నాయి. అవే థామా, ది గర్ల్ ఫ్రెండ్. ఇవి ఏ ఓటీటీలో ఉన్నాయో ఓ లుక్కేయండి.

రష్మిక మందన్న నటించిన ఫస్ట్ హారర్ థ్రిల్లర్ మూవీ 'థామా'. ఇందులో ఆయుష్మాన్ ఖురానా హీరో. బాలీవుడ్ లో ఈ హారర్ థ్రిల్లర్ తో అదరగొట్టింది రష్మిక మందన్న. ఈ మూవీ థియేటర్లలో సూపర్ హిట్ గా నిలిచింది. ఇందులో రష్మిక బేతాళి పిశాచిగా నటించింది. తన గ్లామర్ తోనూ మెస్మరైజ్ చేస్తోంది. ఈ మూవీ ఇప్పుడు అమెజాన్ ప్రైమ్ వీడియోలో స్ట్రీమింగ్ అవుతోంది. డిసెంబర్ 2 నుంచి థామా ఓటీటీలో ఉంది.

థామా సినిమాలో రష్మిక మందన్న తడ్కా అనే బేతాళి ...