భారతదేశం, ఏప్రిల్ 17 -- దేశీయ స్టాక్​ మార్కెట్​లో లాభాల పరంపర కొనసాగుతోంది. బుధవారం ట్రేడింగ్​ సెషన్​లోనూ సూచీలు లాభపడ్డాయి. బీఎస్​ఈ సెన్సెక్స్​ 309 పాయింట్లు పెరిగి 77,044 వద్ద స్థిరపడింది. నిఫ్టీ50.. 109 పాయింట్లు వృద్ధిచెంది 23,437 వద్ద సెషన్​ని ముగించింది. బ్యాంక్​ నిఫ్టీ 738 పాయింట్లు పెరిగి 53,117 వద్దకు చేరింది.

బుధవారం ట్రేడింగ్​ సెషన్​లో ఎఫ్​ఐఐలు రూ. 3,936.42 కోట్లు విలువ చేసే షేర్లను కొనుగోలు చేశారు. అదే సమయంలో డీఐఐలు రూ. 2,512.77 కోట్లు విలువ చేసే విక్రయించారు.

ఇక దేశీయ స్టాక్​ మార్కెట్​లు.. గురువారం ట్రేడింగ్​ సెషన్​ని నష్టాల్లో ప్రారంభించే అవకాశం ఉంది. గిఫ్ట్​ నిఫ్టీ దాదాపు 90 పాయింట్ల నష్టంలో ఉండటం ఇందుకు కారణం.

"నిఫ్టీ50 23,500 దాటితే సెంటిమెంట్​ మరింత పాజిటివ్​గా మారొచ్చు. సూచీ మరింత పెరగొచ్చు. 23,575 వరకు వెళ్లొచ్చు. క...