Hyderabad, ఏప్రిల్ 30 -- మలయాళ మర్డర్ మిస్టరీ థ్రిల్లర్ సినిమాలంటే ట్విస్టులే ట్విస్టులు. అలాంటిదే ఇప్పుడు చెప్పుకోబోయే మూవీ కూడా. గతేడాది జులైలో థియేటర్లలో రిలీజైంది. అమెజాన్ ప్రైమ్ వీడియోతోపాటు యూట్యూబ్ లోనూ తెలుగులో ఫ్రీగా అందుబాటులో ఉంది. ఎలాంటి స్టార్స్ లేకుండా ఓ చిన్న సినిమాగా తెరకెక్కినా.. మంచి థ్రిల్ పంచిన మూవీ ఇది. సినిమా పేరు కురుక్కు.

మలయాళం మర్డర్ మిస్టరీ థ్రిల్లర్ మూవీ కురుక్కు తెలుగులో వీ2 డబుల్ మర్డర్ అనే పేరుతో వచ్చింది. థియేటర్లలో కాకుండా నేరుగా యూట్యూబ్ లోనే ఫ్రీగా స్ట్రీమింగ్ కు రావడం విశేషం. కేవలం గంటా 49 నిమిషాల నిడివితోనే ఉన్న సినిమా ఇది. భార్యాభర్తల హత్యల చుట్టూ తిరిగే కథ. సినిమా మొదట్లోనే వీళ్ల హత్యలు జరిగినట్లుగా చూపిస్తారు.

వాళ్ల అపార్ట్‌మెంట్ బిల్డింగ్ లోనే ఉండే ఓ ఐటీ ఉద్యోగి ఆ హత్యలు చేశాడన్నట్లుగా అతడు కత్తి...