Hyderabad, ఏప్రిల్ 23 -- మలయాళం థ్రిల్లర్స్ అంటే ఇష్టపడని వాళ్లు ఎవరూ ఉండరేమో. ముఖ్యంగా ఓటీటీ వచ్చిన తర్వాత అక్కడి సినిమాలు తెలుగులోకి కూడా డబ్ అయి ఇక్కడి ప్రేక్షకులను అలరిస్తున్నాయి. అలాంటి థ్రిల్లర్ సినిమాలను ఇష్టపడే వాళ్లకు ఓ డిఫరెంట్ ఫీల్ కలిగించే మూవీ పులిమడ (Pulimada). జోజు జార్జ్, ఐశ్వర్య రాజేష్ కలిసి నటించిన ఈ సినిమా యూట్యూబ్ లోనూ ఫ్రీగా అందుబాటులో ఉంది.

పులిమడ 2023లో వచ్చిన మలయాళం థ్రిల్లర్ మూవీ. ఏకే సజన్ డైరెక్ట్ చేసిని సినిమా ఇది. కేవలం గంటా 48 నిమిషాల నిడివితో ఉన్న ఈ సినిమాకు థియేటర్లలోనూ మంచి రెస్పాన్స్ వచ్చింది. ఈ సినిమా కథ ప్రధానంగా ఒక రాత్రిలోనే జరుగుతుంది. ఎంత ప్రయత్నించినా పెళ్లి కాకపోవడంతో మానసికంగా కుంగిపోతాడు ఓ పోలీస్ అధికారి. అతని జీవితంలోకి అనుకోకుండా వచ్చే ఓ అమ్మాయి.. తాగిన మత్తులో ఉన్న అతనితో ఎలా ఆడుకుంటుందన్నదే ...