Hyderabad, మే 8 -- మలయాళం ఇన్వెస్టిగేటివ్ థ్రిల్లర్స్ చాలా వరకు ప్రేక్షకులను ఆకట్టుకునేలానే ఉంటాయి. ఓ మర్డర్ కేసులో పోలీసుల విచారణ ఎలా సాగుతుందో కళ్లకు కట్టేలా అక్కడి ఫిల్మ్ మేకర్స్ చూపిస్తారు. చివరి వరకు అసలు హత్య ఎవరు చేశారో కనిపెట్టడం ప్రేక్షకులకు సాధ్యం కాని విధంగా కథను నడిపిస్తారు. అలాంటిదే అన్వేషిపిన్ కండెతుమ్ మూవీ.

ప్రముఖ మలయాళం నటుడు టొవినో థామస్ లీడ్ రోల్లో నటించిన సినిమా ఈ అన్వేషిపిన్ కండెతుమ్ (Anweshippin Kandethum). అంటే జాగ్రత్తగా వెతికితే దొరకనిదంటూ ఏదీ ఉండదు అని దీని అర్థం. గతేడాది ఫిబ్రవరిలో థియేటర్లలో రిలీజైంది.

సినిమా చూస్తే ఆ టైటిల్ ఎందుకు పెట్టారో మనకు అర్థమవుతుంది. ఈ సినిమా ఇద్దరు అమ్మాయిల హత్యలను పరిష్కరించే ఎస్ఐ ఆనంద్ నారాయణన్ (టొవినో థామస్) చుట్టూ తిరుగుతుంది. ఇది రెండూ వేర్వేరు హత్య కేసులు.

మొదటి అమ్మాయి హత్య క...