భారతదేశం, ఆగస్టు 6 -- ఇండియాలో బెస్ట్​ సెల్లింగ్​ ఫ్యామిలీ కారుగా గుర్తింపు తెచ్చుకున్న టయోటా ఇన్నోవాకు 20ఏళ్లు పూర్తయ్యాయి. ఈ 20ఏళ్లల్లో ఇన్నోవాకు చెందిన మూడు త‌రాల మోడళ్లు - ఇన్నోవా, ఇన్నోవా క్రిస్టా, ఇన్నోవా హైక్రాస్ - క‌లిపి 12 ల‌క్ష‌ల‌కు పైగా యూనిట్ల అమ్మకాల మైలురాయిని అధిగ‌మించాయి. 2005లో తొలిసారిగా మార్కెట్‌లోకి వ‌చ్చిన ఈ మోడ‌ల్, అప్ప‌టి నుంచి మ‌ల్టీప‌ర్ప‌స్ వెహిక‌ల్ (ఎంపీవీ) విభాగంలో తనదైన ముద్ర వేసింది.

టయోటా కిర్లోస్క‌ర్ మోటార్ సేల్స్-స‌ర్వీస్-యూజ్డ్ కార్ బిజినెస్ వైస్ ప్రెసిడెంట్ వరిందర్ వాధ్వా మాట్లాడుతూ.. గ‌త రెండు ద‌శాబ్దాలుగా టయోటా ఇన్నోవా క‌స్ట‌మ‌ర్ల‌తో ఒక బలమైన భావోద్వేగ అనుబంధాన్ని పెంచుకుందని అన్నారు. ఈ భావోద్వేగ బంధంతో పాటు ఇన్నోవా ఒక అద్భుతమైన ఉత్ప‌త్తిగా నిలిచిందని ఆయన వివరించారు.

తొలిసారిగా మార్కెట్‌లోకి వ‌చ్చిన‌ప...