భారతదేశం, జూన్ 28 -- భారత దేశంలో అడాస్​తో కూడిన స్కార్పియో ఎన్​ ఎస్​యూవీని మహీంద్రా అండ్​ మహీంద్రా ఎట్టకేలకు లాంచ్​ చేసింది. దీని ఎక్స్​షోరూం ధర రూ. 21.35లక్షలు. ఫలితంగా ఇప్పుడు మహీంద్రా స్కార్పియో ఎన్​ టాప్​ ఎండ్​ వేరియంట్​ జెడ్​8ఎల్​ 10 లెవల్​ 2 అడాస్​ ఫీచర్స్​తో వస్తోంది. అంతేకాదు, ఈ ఎస్​యూవీలో సరికొత్త వేరియంట్​ని సైతం లాంచ్​ చేసింది సంస్థ. దాని పేరు జెడ్​8ఎల్​. ఎక్స్​షోరూం ధర రూ. 20.29 లక్షలు. పూర్తి వివరాల్లోకి వెళితే..

స్కార్పియో-ఎన్ జెడ్​8ఎల్​ వేరియంట్ ఆరు, ఏడు సీట్ల ఆప్షన్లలో లభిస్తుంది. మాన్యువల్, ఆటోమేటిక్ గేర్‌బాక్స్ ఎంపికలు కూడా ఉన్నాయి. ఇంజిన్ విషయానికి వస్తే, 2.0-లీటర్ టర్బో-పెట్రోల్ ఇంజిన్ లేదా 2.2-లీటర్ డీజిల్ ఇంజిన్‌తో ఇది వస్తుంది. ఈ వేరియంట్ 2డబ్ల్యూడీ (టూ-వీల్ డ్రైవ్), 4x4 (ఫోర్-వీల్ డ్రైవ్) వెర్షన్లలో అందుబాటులో ఉంద...