భారతదేశం, ఫిబ్రవరి 24 -- బైకర్ల ప్రాణాలను రక్షించడానికి మల్కాజ్‌గిరి పోలీసులు వినూత్న కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. అది ఏంటంటే.. హెల్మెట్ బ్యాంక్. రైడర్లు హెల్మెట్‌ను ఉచితంగా తీసుకెళ్లవచ్చు. తెలంగాణ పోలీసుల అరైవ్ అలైవ్ ప్రచారంలో భాగంగా ఈ విధానాన్ని తీసుకువచ్చారు. ద్విచక్ర వాహనదారుల భద్రతా కోసం మల్కాజ్‌గిరి పోలీస్ కమిషనరేట్ ఈ 'హెల్మెట్ బ్యాంక్' చొరవను ప్రవేశపెట్టింది.

ఈ కార్యక్రమం హెల్మెట్ లేని రైడర్లు అక్కడికక్కడే హెల్మెట్‌లను అప్పుగా తీసుకోవడానికి వీలు కల్పిస్తుంది. ఇది తక్షణం ఎలాంటి హాని కలగకుండా హెల్మెట్ పెట్టుకునేందుకు ఉపయోగపడుతుంది. ద్విచక్ర వాహనదారు సేఫ్టీని పాటించేందుకు సాయపడుతుంది.

ఇక్కడ హెల్మెట్ తీసుకునేవారు ప్రాథమిక వివరాలను అందించి హెల్మెట్‌ను పొందిన 24 గంటల్లోపు దానిని తిరిగి ఇవ్వాలి. డిప్యూటీ కమిషనర్ ఆఫ్ పోలీస్, ట్రాఫిక...