భారతదేశం, సెప్టెంబర్ 14 -- భారతదేశంలో అత్యంత భారీ ఆన్‌లైన్ సేల్స్ ఈవెంట్‌గా భావించే గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ 2025ను, ఈ పండుగ సీజన్​ సందర్భంగా అమెజాన్ ఇండియా ప్రకటించింది. ఈ ఫెస్టివల్‌లో భాగంగా ముందస్తుగా.. సెప్టెంబర్ 13 నుంచే 'ఎర్లీ డీల్స్' పేరుతో ప్రత్యేక ఆఫర్లను అందుబాటులోకి తెచ్చింది. ఈ మెయిన్ సేల్ సెప్టెంబర్ 23 నుంచి ప్రారంభమవుతుంది. అయితే ప్రైమ్ మెంబర్స్ కు మాత్రం 24 గంటల ముందే, అంటే సెప్టెంబర్ 22 నుంచే ఈ సేల్ అందుబాటులోకి వస్తుంది.

ఈ ఫెస్టివల్ కోసం అమెజాన్ తన డెలివరీ నెట్‌వర్క్‌లను విస్తరించింది. కొనుగోలుదారుల అనుభవాన్ని మెరుగుపరచడానికి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ) ఆధారిత షాపింగ్ టూల్స్‌ను, అలాగే ప్రత్యేక వినోద కార్యక్రమాలను కూడా పరిచయం చేస్తోంది. ప్రైమ్ మెంబర్లకు కేవలం ముందుగా సేల్స్ ప్రారంభం కావడమే కాకుండా, సేల్స్ కాలంలో ప్రత్య...