భారతదేశం, జనవరి 5 -- రోడ్డు భద్రతను పెంపొందించడానికి, మోటార్ సైకిల్ సంబంధిత ప్రమాదాల సంఖ్యను తగ్గించడానికి విశాఖపట్నం నగర పోలీసులు కీలక నిర్ణయం తీసుకున్నారు. జనవరి 1, 2026 నుండి నగరం అంతటా 'నో హెల్మెట్-నో పెట్రోల్' కార్యక్రమాన్ని ప్రారంభించారు.

హెల్మెట్ ధరించని ద్విచక్రవాహనదారులు పెట్రోల్ బంకుల్లో పెట్రోల్ పోయకూడదని పోలీసు అధికారులు సీరియస్‌గా చెప్పారు. బాధ్యతాయుతమైన రైడింగ్‌ను పెంపొందించడానికి, సిటీ రోడ్లపై మరణాలను తగ్గించడానికి ఈ చర్య ఉపయోగపడుతుందని అంటున్నారు.

ఈ ప్రచారం ప్రజలలో అవగాహన పెంచడం, ప్రాథమిక భద్రతా నిబంధనలను పాటించడాన్ని అమలు చేయడం లక్ష్యంగా పెట్టుకుందని విశాఖ పోలీస్ కమిషనర్ శంక బ్రత బాగ్చీ నొక్కి చెప్పారు. నో హెల్మెట్-నో పెట్రోల్ రూల్ కేవలం ఒక నియంత్రణ కాదు, ఇది ప్రాణాలను రక్షించే చర్య అని పేర్కొన్నారు. ప్రతి రైడర్, వెనుక ...